షార్ట్ సర్క్యూట్ అయ్యి రెండు బస్సులు దగ్ధం..

by Hamsa |
షార్ట్ సర్క్యూట్ అయ్యి  రెండు బస్సులు దగ్ధం..
X

దిశ, సూర్యా పేట: షార్ట్ సర్క్యూట్ అయ్యి రెండు బస్సుల్లో మంటలు చెలరేగి బస్సులు దగ్ధమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చివ్వేంల మండల పరిధిలోని గుంపుల గ్రామం లోని ఎన్ హెచ్ 65 వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రోడ్ మీద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

ఈ క్రమంలో మరో బస్ సహాయంతో సెల్ఫ్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సుల్లో మంటలు చెలరేగి రెండు బస్సులు దగ్ధమైయ్యి సమాచారం అందుకున్న చివ్వేంల ఎస్సై విష్ణుమూర్తి, ఫైర్ అధికారి శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని, మంటలను ఫైర్ ఇంజన్ సహాయంతో అర్పి అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై ఏపీఎస్ ఆర్టీసీ దర్యాప్తు చేపడుతుంది.

Advertisement

Next Story