- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునగాల వద్ద ఢీకొన్న మూడు ప్రైవేట్ బస్సులు, డీసీఎం వ్యాన్
దిశ, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న పలు ట్రావెల్స్ కు చెందిన మూడు ప్రైవేట్ బస్సులు , ఓ డీసీఎం వ్యయాన్ ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్న బస్సును వెనుక నుండి వస్తోన్న డీసీఎం ఢీకొట్టగా.. దాని వెనకాలే వస్తున్న మరో రెండు బస్సులు డీసీఎంను బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలవగా.. బస్సుల్లో ప్రయాణించే మరో ఇద్దరు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 80 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. అర్థరాత్రి బస్సులు రోడ్ల మీద నిలిచి పోవడంతో విజయవాడ వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. దాదాపు రెండు గంటలసేపు రోడ్డు మీదనే బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు.