- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలి
దిశ, నూతనకల్: ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని ఏఐకేఎంఎస్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలో తహసీల్దార్ శ్రీనివాసరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దింటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ... రైతాంగం వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటడంతో, ఎస్సారెస్పీ నీళ్లు చివరి ఆయకట్టు వరకు అందకపోవడం, చెరువులు, కుంటలు నీటితో నింపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు ఎండిపోతున్నాయని గ్రామాల్లో విపరీతంగా బోర్లు వేస్తూ రైతాంగం ఆర్థికంగా నష్టపోతున్నారాన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది. దీనిలో ప్రధానంగా రైతాంగం ఈ పంట నష్టాల నుంచి బయట పడటానికి ఉపయోగపడే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎండిపోతున్న పంట పొలాలను అధికారులు పరిశీలన చేసి, ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, పార్టీ నాయకులు మున్నా అశోక్, గడ్డం శ్రీను, పులుసు అనిల్, పులుసు సత్తయ్య, కూసు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.