ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే

by Naresh |
ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే
X

దిశ, చండూరు: పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా నిలిచిపోతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. చండూరు టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. అబద్ధం మోసం పునాదుల మీద నిలిచిన బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన మూడు నెలలకే పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు వలసలు వెళ్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌ను కాపాడే అవకాశం ఉందని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మెజార్టీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్‌లో చేరుతారని జోస్యం చెప్పారు. టీడీపీ అధికారం కోల్పోయి 20 సంవత్సరాలు అవుతున్న తెలంగాణలో పటిష్టమైన క్యాడర్ కలిగి ఉందని బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలలకే మునిగిపోతుందని జోస్యం చెప్పారు. పేద వర్గాలకు వేదికైనా తెలుగుదేశాన్ని తెలంగాణ ప్రాంతంలో లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేసి టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని. టీడీఎల్‌పీని బీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నారని విమర్శించారు. నాడు చేసిన పాపాలు తగిలి నేడు శాపాలుగా మారి బీఆర్ఎస్ కొద్దిరోజుల్లోనే కనుమరుగు కానుందని అన్నారు. బీఆర్ఎస్ ఎల్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే పరిస్థితి త్వరలో రావడం ఖాయమన్నారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉండి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ పార్టీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించే అర్హత లేదన్నారు. తెలంగాణలో అధికారం కూలిపోయి 20 సంవత్సరాల అవుతున్న ఇంకా చంద్రబాబు నాయుడు పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదు అన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి ఎండీ షరీఫ్, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రజల్ల లింగయ్య, దోమల వెంకన్న, మోగు గుదాల పార్వతమ్మ, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పగడాల లింగయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి లు పుప్పాల యాదయ్య, మంగి మహేష్, తోకల యాదయ్య, సీనియర్ నాయకులు బోడ బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed