- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోపిడి ప్రభుత్వానికి చరమగీతం పాడాలి
దిశ, కనగల్లు: పేదవాళ్లు ఇల్లు కట్టుకోవడానికి, పిల్లలకు జాబ్ రావడానికి, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని కోమటిరెడ్డి అన్నారు. 15 రోజుల్లో మీ వెంకన్న ఎమ్మెల్యేగా వస్తున్నాడని కనగల్లు మండలంలోని పొనుగోడు గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పొనుగోడు అంటేనే కాంగ్రెస్ అంటేనే పొనుగోడు అని అన్నారు. ఇంత ఉత్సాహంగా ఉషారుతో స్వాగతం పలికిన గ్రామ ప్రజలందరికీ పాదాభివందనం అని అన్నారు. కనగల్లు మండలంలో నాకు ఇష్టమైన పొనుగోడు నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టానని పార్టీలోకి కొత్తగా జాయిన్ అయిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి అందరూ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు నిర్మించలేదని ఐదు లక్షల కోట్ల అప్పు చేశారని ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడని ఎన్నికలు రాగానే మళ్లీ పథకాలు గుర్తుకు వస్తాయని మండిపడ్డారు. గెలిచిన మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని అన్నారు. పేదవాళ్ల కోసమే తెలంగాణ ఇచ్చాము అని రాహుల్ గాంధీ అన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పొనుగోడు సర్పంచ్ మెరుగు శివయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కూసుకుంట్ల రాజు రెడ్డి, పోలే విజయ్ కుమార్,మందడి రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.