Krishna river : ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణ నది..

by Sumithra |
Krishna river : ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణ నది..
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : కృష్ణా నదికి భారీగా వరద నీరు ప్రవహించడంతో పైన ఉన్న నాగార్జునసాగర్ నిండడంతో అధికారులు సాగర్ డ్యాం గేట్ ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మహంకాళి గూడెం గ్రామంలో గల పుష్కర్ ఘాట్ లో ఉధృతంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండిపోయిన కృష్ణా నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీళ్లు ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామల ప్రజలు, జాన్ పహాడ్ కు వచ్చిన భక్తులు మహంకాళి గూడెం వద్దకు చేరుకుని ఆ నీటిని సందర్శించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story