- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
దిశ, డిండి: మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో రూ.20.66 లక్షలతో పాఠశాలలో మన ఊరు మనబడి మొదటి విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు బోసిపోయాయన్నారు.
నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగా రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు.అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే డిండి మండల పరిధి ఎర్రగుంటపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో చేపడుతున్న సి సి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ లు తుం నాగార్జున్ రెడ్డి, మాధవరం శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ పేట రాధవెంకటయ్య, భగవంత రావు, గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సామ్య నాయక్, భాస్కర్ రెడ్డి, మత్స్య శాఖ చైర్మన్ మేకల కాశన్న తదితరులు పాల్గొన్నారు.