- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2 లక్షల రుణమాఫీ.. నల్గొండ జిల్లా రైతుల లిస్టు ఇదే..!
దిశ నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్నదాతలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. రుణమాఫీ చేసి అండగా నిలిచింది. రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,37,799 మంది రైతులకు రూ.2810.84కోట్లు రుణమాఫీ అయ్యాయి. ప్రతిపక్షాలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని ప్రకటించినప్పటికీ రైతుల కోసం ఎంతటి త్యాగానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రస్తుత ప్రభుత్వం నిరూపించింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో...
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు విడతలుగా. 3,37,799 మంది రైతులకు, రూ.2810.84 కోట్ల రుణమాఫీ చేశారు. అందులో భాగంగా మూడు జిల్లాల వారీగా పరిశీలిస్తే..
యాదాద్రి భువనగిరి జిల్లా..
మొదటి విడత రైతులు 36,483
రుణమాఫీ రూ. 199.87కోట్లు
రెండో విడత రైతులు 17991
రుణమాఫీ రూ. 176.12కోట్లు
మూడో విడత రైతులు 9995
రుణమాఫీ రూ. 164.66కోట్లు.
సూర్యాపేట జిల్లా....
మొదటి విడత రైతులు 56217
రుణమాఫీ రూ.282.78 కోట్లు
రెండో విడత రైతులు 26376.
రుణమాఫీ రూ. 250.07 కోట్లు
మూబె విడత రైతులు 17952
రుణమాఫీ రూ.305.91కోట్లు.
నల్లగొండ జిల్లాలో..
మొదటి విడత రైతులు 84, 963
రుణమాఫీ రూ.465.97
రెండో విడత రైతులు 51324
రుణమాఫీ రూ. 512.51
మూడో విడత రైతులు 36498
రుణమాఫీ రూ. 455.26..
నెల రోజుల్లోనే రుణమాఫీ పూర్తి....
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణ మాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది .ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి అత్యంత కష్టమైన పని . అయినప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి పూనుకుందని చెప్పొచ్చు. అయితే మొదటి విడత జూలై 17న రూ.1 లక్ష వరకు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. రెండో విడత జులై 30న రూ.1.50లక్షల వరకు రుణమాఫీ చేసింది. ముచ్చటగా మూడోసారి రూ. 2లక్షల రుణమాఫీ పూర్తి చేసింది. అయితే రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కటాఫ్ డేట్ ను గతంలోనే ప్రకటించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వివిధ బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసింది. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికం కాకుండా రైతు పట్టా పాస్ బుక్ ప్రామాణికంగా తీసుకొని రెండు లక్షల రుణమాఫీ చేసింది. శనివారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు
రుణమాఫీ కావడంతో కష్టం తప్పింది: అరెకంటి సురేష్ రైతు, ధర్వేశిపురం
ప్రభుత్వం చేసిన రుణమాఫీలో నాకు మొదటి విడతలోనే రూ.లక్షలోపు రుణమాఫీ జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడంతో ఈ ప్రభుత్వం రైతుల గుండెల్లో నిలిచిపోయింది. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. అందుకే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూడాలి.
రైతులు సందేహాలను నివృత్తి చేసుకోవాలి: శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నల్లగొండ
రెండు లక్షల లోపు పంట రుణం తీసుకున్న ఏ రైతు అయినా రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేకపోతే ఆయా మండలాల వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ జరిగి తీరుతుంది.