తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

by Kalyani |
తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…
X

దిశ, ఎం.తుర్కపల్లి: తుర్కపల్లి మండల కేంద్రంలో శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయంలో పరిశీలించి అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకం లబ్ధి కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులలో ఉన్న లోపాలను సరిదిద్ది ఆన్లైన్ నమోదు చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రజాపాలన దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపరచాలని, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి మోడ్యూల్ లో ఉన్న అన్ని రకాల దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారం, రిజిష్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు కావలసిన ధృవీకరణ పత్రాలను సత్వరమే అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి.దేశ్యా నాయక్, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story