చీకట్లో సూర్యాపేట... అధికారులు పట్టించుకోరా..?

by M.Rajitha |
చీకట్లో సూర్యాపేట... అధికారులు పట్టించుకోరా..?
X

దిశ, సూర్యాపేట టౌన్: సూర్యాపేట పట్టణంలో చేపట్టిన జంక్షన్ల సుందరీకరణ పనులు మున్నాల ముచ్చటగా మిగిలిపోయాయి. రెండేళ్ల క్రితం సూర్యాపేట పట్టణంలో ప్రధాన జంక్షన్‌లలో ఆధునిక హంగులతో సుందరీకరణ చేశారు. పట్టణ వాసులు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు జంక్షన్ వద్ద నిలబడి సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేవారు. రాత్రి వేళలో పట్టణంలోకి కొత్తగా వచ్చినవారు జంక్షన్‌లను ప్రధాన రహదారులను చూసి ఇది సూర్యాపేట ఐన అంటూ ఆశ్చర్యపోయేవారు. ఒక్కో జంక్షన్‌కి కొన్నీ లక్షల చొప్పున ఖర్చు చేసి వివిధ డిజన్లతో ఆధునిక హంగులతో అభివృద్ధి చేశారు. సరిగ్గా రెండేళ్లు కూడా తిరగకముందే జంక్షన్ల హంగులు తగ్గాయి. లైట్లు వెలగడం లేదు ఫౌంటెన్లు పనిచేయడం లేదు.

సూర్యాపేట నడిబొడ్డున పాత బస్టాండ్ సంతోష్ బాబు విగ్రహం వద్ద కొన్ని లక్షలు ఖర్చుపెట్టి ఫౌంటేన్, లైట్లు సుందరీకరణ చేశారు. అత్యాధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ జంక్షన్ చూసి పట్టణ వాసులు సంతోషపడ్డారు. జంక్షన్ సోబగులు రెండేళ్లకే కనుమరుగైపోయాయి. పొట్టి శ్రీరాం సెంటర్లో నీళ్లతో ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది పనిచేయడం లేదు. లైట్లు వెలగడం లేదు. పద్మశాలి భవన్ రోడ్ లో ఏర్పాటు చేసిన బొమ్మల కళ తప్పింది. అధునీకరణ కోసం ఏర్పాటు చేసిన కొన్ని కూడళ్ళ పరిస్థితి కూడా ఇంతే. జంక్షన్ల ఏర్పాట్లులో భారీ అవినీతి జరిగిందని విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. పనుల్లో నాణ్యత లేకపోవడం లక్షలు వేచించిన ఈ జంక్షన్ల నిర్వహణను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దృష్టి సారించని మున్సిపాలిటీ..

జిల్లా కేంద్రంలో సుందరనీకరణ కోసం గత ప్రభుత్వం పట్టణంలో ఆయా కూడలిలో ఏర్పాటు చేసిన సుందరీకరణ చిత్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వల్లే సుందరీకరణ చిత్రాలు కనుమరుగవుతున్నాయని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని ఆయా కూడలిలలో ఏర్పాటుచేసిన సుందరీకరణ చిత్రాలు అప్పట్లో సూర్యాపేట జిల్లా ప్రజలను బాగా ఆకర్షించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ పట్టణంలో లేని సుందరీకరణ దృశ్యాలను సూర్యాపేట పట్టణంలోని ఆయా కుడలీలలో ఏర్పాటుచేసి అప్పట్లో సూర్యాపేట మున్సిపాలిటీ అధికారులు ప్రజల మన్ననలను పొందారు.అంతటి ప్రాముఖ్యత కలిగిన సుందరీకరణ చిత్రాలు ప్రస్తుతం ఆదరణ కోల్పోయి దీన స్థితికి చేరుతున్నాయి. చిత్రాలపై వేసిన పెయింటింగ్స్ వెలిసిపోతున్నాయి. సరైన లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం లేదు. గతంలో సుందరీకరణ చిత్రాలపై కొంతమంది మున్సిపాలిటీ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం లైటింగ్ ఏర్పాటు చేయటం రాత్రి సమయంలో వాటర్ ఫాల్స్ వివిధ రూపాలలో వెలిగేలా వాటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అటువంటివి ఏమి ఏర్పాటు చేయ లేకపోవడంతో అవి నిరాదరణకు గురవుతున్నాయి. మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వల్లనే అవి నిరాదరణ గురవుతున్నాయని ప్రజల విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం జంక్షన్ల సుందరీకరణ అభివృద్ధి నిర్వహణపై దృష్టి సారించాలనీ, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోనీ, తిరిగి ఫౌంటెన్ల, లైటింగ్ పని చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed