- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధే చేయడమే ధ్యేయం
దిశ, చిట్యాల: నకిరేకల్ నియోజకవర్గంలోని గ్రామలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి, వెలిమినేడు, ఏపూరు, పేరే పల్లి, చిన్నకాపర్తి గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుండ్రాంపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఆయన ప్రారంభించి అనంతరం రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వెలిమినేడు గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వందకు వందశాతం అమలు చేసే దిశగా పనిచేస్తుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపడుతూనే మరోపక్క అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమిష్టి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసయ్య, చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు దేశ బోయిన నరసింహ, మాజీ సర్పంచులు అంతటి వెంకటేశం, జనగాం రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.