కన్నీటి సంద్రమైన గ్రామం.. పాడే మోసిన గూడూరు నారాయణరెడ్డి

by Sumithra |
కన్నీటి సంద్రమైన గ్రామం.. పాడే మోసిన గూడూరు నారాయణరెడ్డి
X

దిశ, భూదాన్ పోచంపల్లి : కొన్ని రోజుల క్రితం మండలంలోని రామలింగంపల్లి గ్రామానికి చెందిన గూడూరు మణికాంత్ రెడ్డి ఎంబీబీఎస్ విద్యార్థి ఫిలిప్పీన్స్ లో అనుమానస్పదంగా మృతి చెందాడు. కాగా విద్యార్ధి పార్థివ దేహం శనివారం తన సొంత గ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామమంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ఎంబసీ, ఏజెన్సీ అధికారులతో మాట్లాడి ఫిలిప్పీన్స్ దేశం నుండి మణికాంత్ రెడ్డి పార్థీవ దేహాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర వహించి మృతుడి అంత్యక్రియల్లో పాల్గోని పాడే మోశాడు. బాధితుని తల్లిదండ్రులను ఓదార్చి, దైర్యం చెప్పారు. ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అంత్యక్రియలో పాల్గొన్నారు.

Advertisement

Next Story