మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి..

by Naveena |
మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి..
X

దిశ, చింతపల్లి : చింతపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఈనెల 27న వనస్థలిపురం ప్రసీద్ హాస్పిటల్ వారి సారధ్యంలో మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రసిద్ హాస్పిటల్ చైర్మన్ చైతన్య రాజు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, వృద్ధులు వితంతువులు, వికలాంగులు, ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. నిర్వహించే వైద్య శిబిరంలో డయాబెటాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాటిక్స్, జనరల్ సర్జరీ, తదితర విషయాలపై వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మండలంలోని ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోపరుచుకోవాలి అన్నారు. అదేవిధంగా ఉచిత మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ రఘువీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయకులు హాజరు కానున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed