- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nalgonda : స్పౌజ్ బది’లీలలు’..ఫిర్యాదు చేస్తే ఆరుగురిపై సస్పెన్షన్ వేటు..
దిశ,నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించే దిశగా ఉపాధ్యాయుల బదిలీలకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీనిని ఆసరాగా చేసుకుని విద్యాశాఖ జిల్లా ఉన్నత అధికారులు అందిన కాడికి దోచుకునే ప్రయత్నం నల్గొండ జిల్లాలో బహిరంగంగానే జరిగినట్లు తెలుస్తోంది.అసలు నల్లగొండలో జరిగిన ఉపాధ్యాయ,హెడ్మాస్టర్ (Headmaster) స్పాజ్ అక్రమ బదిలీలు జరిగిన తీరు విస్మయానికి గురిచేస్తుంది. విద్యాశాఖ అధికారికి ఈ బదిలీలు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా జరిగినట్లు తెలుస్తుంది. నిబంధనలు గాలికి వదిలి వారి ఇష్టానుసారంగా స్పాజ్ బదిలీలు చేసినట్లు తెలుస్తుంది.
నల్గొండ జిల్లాలో స్పాజ్ పాయింట్లు దుర్వినియోగం చేస్తూ ఆరుగురు ఉపాధ్యాయులు అక్రమంగా బదిలీ అయ్యారు అని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (School Education) వారికి కొన్ని ఉపాధ్యాయ సంఘాల వారు ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారిని విచారణ చేయమని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే వారి పై సమగ్ర విచారణ జరిపి వారిని సస్పెండ్ చేశారు. వారిలో సస్పెండ్ అయిన వారు స్వాతి గణిత ఉపాధ్యాయురాలు ,సులోచన ఫిజికల్ సైన్స్ ,శ్రీనివాస్ ఫిజికల్ సైన్స్ ,వెంకట్ రెడ్డి సోషల్, రజిత ఫిజికల్ సైన్స్ ,శ్రీరాములు ఎస్జిటి ఉన్నారు. వీరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బదిలీలు పొందాలని వారు అనుకున్న స్థానంలో పోస్టింగ్ తీసుకున్నారని రుజువు కావడంతో వారిని సస్పెండ్ చేశారు. ఇంతవరకు బానే ఉంది అసలు సంగతి చాలానే ఉంది.
స్పాజ్ ఉద్దేశానికి తూట్లు..
స్పాజ్ ముఖ్య ఉద్దేశం భార్యాభర్తలైన ఉపాధ్యాయులు గాని హెచ్ఎంలు గాని ఒకే చోట కానీ ఒకే మండలం లో పనిచేసే విధంగా వెసులుబాటు కల్పిస్తూ వారికి పది పాయింట్లు అని అదనంగా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల వారు మెరిట్ లిస్ట్ లోకి వస్తారు. ఇలా రావడం వల్ల వారికి ఇష్టమైన ప్రదేశంలో ఒకే చోట ఒకే మండలం లో ఎంచుకునే అవకాశం కలుగుతుంది. ఒకవేళ ఒకే మండలం లో ఖాళీ లేనట్లయితే పక్క మండలంలో ఖాళీ ఉన్నా కానీ వారికి ఈ అవకాశం వచ్చే విధంగా స్పాజ్ పాయింట్లు వాడుకునే వీలు ఉంటుంది.స్పాజ్ విధి విధానాలను నిబంధనలకు నల్లగొండ విద్యాశాఖ అధికారులు తూట్లు పొడిచారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.. హెచ్ఎం లకు హారతి పట్టారు..
నల్గొండ జిల్లాలో స్పాజ్ ధ్రువీకరణ పాయింట్లు వాడుకొని తప్పుడు పద్ధతిలో వారికి కావలసిన చోట బదిలీ చేసుకున్న వారు చాలానే ఉన్నారు. అందులో ఉపాధ్యాయులు ఆరుగురు దొరికారు కావున వారికి సస్పెండ్ చేశారు. అది కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ఆర్జేడీకి కంప్లైంట్ చేస్తేనే అసలు విషయం బయటకు వచ్చింది. కంప్లైంట్ (Compliant) చేయకుంటే మాత్రం దర్జాగా ఉద్యోగం చేసుకునేవారు అలాగే బదిలీలు జరిగిన వారిలో జీహెచ్ఎంలు కూడా ఉన్నారు. దిశకు తెలిసి ఆధారాలతో సహా ఆరుగురు హెచ్ఎంలే స్పాజ్ వాడుకొని అనుకున్న స్థానాలు పొందారు. అదనపు బాధ్యతలతో ఎంఈఓ గా పని చేస్తూ ఉన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారులు కాసులకు కక్కుర్తి పడి వారిని చూసీ చూడనట్లు వదిలివేస్తున్నట్లు తెలుస్తుంది. వారికి కూడా వారి బదిలీ అక్రమం అని తెలిసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక లక్షల్లో రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక హెచ్ఎం, ఎంఈఓ అదనపు బాధ్యతలతో గా కట్టంగూర్ లో పనిచేస్తున్నారు. అలాగే మాడుగులపల్లి మండలంలో హెడ్మాస్టర్, ఎంఈఓ గా అదనపు బాధ్యతలు తీసుకుని పని చేస్తున్నారు.వీరు గతంలో సూర్యాపేటలో పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యి ఒక ఉపాధ్యాయ సంఘం అండదండలతో స్పాజ్ పాయింట్లు దుర్వినియోగం చేసి బదిలీ అయ్యారు.అలాగే కనగల్,నార్కట్ పల్లి,చిట్యాల మండల పరిధిలో లో పనిచేస్తున్న హెడ్మాస్టర్ల స్పాజ్ దుర్వినియోగం చేసినట్లు తెలుస్తుంది.అక్రమంగా స్పాజ్ పాయింట్లు తో బదిలీలతో వచ్చిన వీళ్లు ఉపాధ్యాయులు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో విద్యాశాఖ అధికారులకు తెలియాలి.ఇదే విషయమై రెండు రోజులుగా డీఈఓ (DEO) వివరణ కోరడం కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
విచారణ జరిగేనా..
నల్లగొండలో హెడ్మాస్టర్ల స్పాజ్ ని దుర్వినియోగం చేయడం వెనుక జిల్లా విద్యాశాఖ అధికారు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. డీఈవోకే విచారణకు ఆదేశాలిస్తే.. కంచె చేను మేసినట్లు అవుతుంది. ఈ స్పాజ్ పాయింట్లు దుర్వినియోగం మీద జిల్లా కలెక్టర్ కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆర్జేడీ కానీ ప్రత్యేక చొరవతో విచారణ జరిపితే తప్పక దోషులు దొరికే అవకాశం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.