Johnny Master: జానీ మాస్టర్ ఇంట్లో దీపావళి వేడుకలు.. వైరల్‌గా మారిన ఫొటోలు

by Gantepaka Srikanth |
Johnny Master: జానీ మాస్టర్ ఇంట్లో దీపావళి వేడుకలు.. వైరల్‌గా మారిన ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali Celebrations) పండుగను టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) ఘనంగా జరుపుకున్నారు. ఇంటి మొత్తాన్ని దీపాలతో అలంకరించి.. టపాసులు పేల్చారు. ఈ మేరకు ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘వాళ్ల కేరింతలే మన సంతోషం. ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరు నవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి(Diwali)’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు.

కాగా, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన జానీ మాస్టర్‌కు ఇటీవల బెయిల్ రావడంతో.. చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి బయటికి వచ్చారు. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే.. తన వద్ద పనిచేసే మైనర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్(Johnny Master) పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలతో.. బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ(Chanchalguda Jail) జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదల అయ్యాక వచ్చిన తొలి పండుగ కావడంతో ఫ్యామిలీతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.







Advertisement

Next Story