- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయవాడ, విశాఖ సిటీలకు మెట్రో సేవలు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాజధాని అమరావతి(amaravati)ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం.. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలతో ఐటీ మంత్రి ఒప్పందాలు చేసుకుని.. మరిన్ని కంపెనీలు అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రముఖ పట్టణాలు అయిన విజయవాడ(vijayawada), విశాఖపట్నం(vizag)లో.. మెట్రో(Metro) ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం.. రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తుంది. ఇందులో విజయవాడ మెట్రోకు రూ.25,130 కోట్లు, విశాఖ మెట్రోకు రూ.17,232 కోట్ల ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన సమయంలో కేంద్రం తీసుకొచ్చిన విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణానికి.. కేంద్రమే నిధులు ఇవ్వాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం అవసరం ఉన్న భూసేకరణకు అయ్యే రూ.2,799 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.