Allu Ayaan: బన్నీకి బిగ్ షాక్ ఇచ్చిన కొడుకు అయాన్.. ఇష్టమైన హీరో మీరు కాదు ఆయనంటూ సంచలన కామెంట్స్!

by Kavitha |
Allu Ayaan: బన్నీకి బిగ్ షాక్ ఇచ్చిన కొడుకు అయాన్.. ఇష్టమైన హీరో మీరు కాదు ఆయనంటూ సంచలన కామెంట్స్!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అందరికీ సుపరిచితమే. ‘గంగోత్రి’(Gangothri) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తన ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీ సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప2’(Pushpa2)లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే.. ఇంత స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్‌‌కి అతని కొడుకు అయాన్ బిగ్ షాక్ ఇచ్చాడు. అల్లు అయాన్(Allu Ayaan).. నా ఫేవరేట్ హీరో మీరు కాదని వేరే హీరోనే నా ఫేవరేట్ హీరో అని ఐకాన్ స్టార్‌కి తెగేసి చెప్పేశాడట. ప్రస్తుతం అల్లు అయాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య(Balakrishna) బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’(Unstopable season 4). ఈ షో ఇటీవల ఆహాలో మొదలైన సంగతి తెలిసిందే. మొదటి గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) వచ్చాడు. అలాగే దుల్కర్ సల్మాన్(Dulkar Salman) సైతం హాజరయ్యాడు.

అయితే తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ షో కి వచ్చారట. ప్రస్తుతం బాలకృష్ణ- అల్లు అర్జున్‌ల ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యిందట. ఇక అల్లు అర్జున్‌తో అల్లు అయాన్ కూడా జాయిన్ అయ్యాడట. అల్లు అయాన్‌ని బాలకృష్ణ నీకు ఇష్టమైన హీరో ఎవరని అడిగాడట. అందుకు సమాధానంగా అల్లు అయాన్.. నాకు ప్రభాస్(Prabhas) అంటే చాలా ఇష్టం. ఆయనే నా ఫేవరేట్ హీరో అని చెప్పాడట. ప్రభాస్ యాక్షన్ అదరగొడతాడు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం అన్నాడట. అల్లు అయాన్ కామెంట్స్‌కి అల్లు అర్జున్ ఖంగు తిన్నాడట. తండ్రి అంత బడా స్టార్ కాగా.. అల్లు అయాన్ మాత్రం మరొక నటుడు పేరు చెప్పడం సంచలనంగా మారింది. కాగా ఇది అల్లు అర్జున్‌కి బిగ్‌షాక్ అనే చెప్పాలి.

Advertisement

Next Story