- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP TET-2024: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. టెట్ ఫలితాలపై కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: AP TET-2024 ఫలితాలపై రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ (Department of Higher Education) కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 4న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలను విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. అయితే, వాస్తవానికి టెట్ ఫలితాలు (TET Results) నవంబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. ఫైనల్ కీ (Final Key) వెల్లడిలో జాప్యం కారణంగా ఫలితాల విడుదల తేదీని తాత్కాలికంగా వాయిదా వేశారు.
దీంతో ఈ నెల 4న (సోమవారం) టెట్ ఫలితాలు (TET Results) విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉన్నత విద్యా శాఖ టెట్ పరీక్షలను (TET Exams) పకడ్బందీగా నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,68,661 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష రాసేందుకు 4,27,300 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 86.28 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లుగా అధికారులు వెల్లడించారు.