- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nara Lokesh:‘రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ సిద్ధం’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిందని , యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటన చివరి రోజు మంత్రి లోకేష్ న్యూయార్క్ లోని విట్ బై హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు న్యూయార్క్ మహానగరంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనం వదిలేసి కాలినడకన బయలుదేరి వెళ్లారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. బ్లూ ప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు భారత్ లో ఏ రాష్ట్రంలోని అనుకూల వాతావరణం ఎపిలో ఉంది. 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురంవద్ద జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది. దీంతో పాటు రాష్ట్రంలో మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్ అందుబాటులోకి తెస్తాం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యత్‌తోపాటు యువతకు ప్రత్యేకమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా వచ్చే ఏడాది నుంచి కరిక్యులమ్ లో మార్పులు చేయబోతున్నాం.
అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ఏఐ నిపుణులు తయారవుతారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని మంత్రి లోకేష్ చెప్పారు. పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా లోకేష్ అమెరికా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సిఇఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్ట్లర్ (ఎగ్జిక్యూటివ్ చైర్మన్ & సిఇఓ, యుఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్, రాబర్ట్ టిచియో (సిఇఓ, ఫోర్టెస్క్ క్యాపిటల్, సంజయ్ పటేల్ (వైస్ చైర్మన్, అపోలో క్యాపిటల్), రిచర్డ్ డ్రెస్డేల్ ( సీనియర్ ఎండి, మెడి మేడిసన్ రివర్ క్యాపిటల్), కెన్ నోవాక్ (ఎండి, అలెక్చ్ బ్రౌన్ & రేమండ్ జేమ్స్), సుసాన్ ఫోర్సింగ్డల్ (ఎండి, ఎలియెన్స్ క్యాపిటల్), డ్యానీ ఫ్రాంక్లిన్ (పార్టనర్, బుల్లీ పల్పిట్ ఇంటర్నేషనల్), థామస్ పొంపిడో (పార్టనర్ & ఫౌండర్, మార్కర్ ఎల్ఎల్ సి), జిమ్ ఊలెరి (ఫౌండింగ్ పార్టనర్, ఊలెరి & కో), మిచైల్ డబ్లియర్ (ఫౌండర్, డబ్లియర్ & కంపెనీ), జెఫ్ న్యూక్ టెర్లీన్ (మేనేజింగ్ పార్టనర్, న్యూ క్యాపిటల్), ధ్రువ్ గోయల్ (సిఇఓ, ఫోర్ లయన్ క్యాపిటల్), నిఖిల్ సిన్హా (సిఇఓ, వన్ వ్యాలీ), సన్ గ్రూప్ వైస్ చైర్మన్ శివ్ ఖేమ్కా, ఎండి వైద్యనాథన్ శివకుమార్, డైరక్టర్లు జయశ్రీ ఖేమ్కా, ఇలినా దూబే పాల్గొన్నారు.