Renu Desai : నటి రేణు దేశాయ్ తల్లి కన్నుమూత

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-21 16:48:09.0  )
Renu Desai : నటి రేణు దేశాయ్ తల్లి కన్నుమూత
X



దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య నటి రేణుదేశాయ్(Renu Desai) మాతృ(mother passes away)వియోగానికి గురయ్యారు. తల్లి మరణ వార్తను ఆమె ఫోటోతో ఓం శాంతి అంటూ ఎక్స్ లో రేణు దేశాయ్ పోస్టు చేశారు. పోస్టులో పునరపి జననం పునరపి మరణం..పునరపి జననీ జఠరే శయనం.. ఇహ సంసారే బహుదుస్తారే..కృపయాపారే పాహి మురారే అన్న శ్లోకాన్ని జత చేసింది. మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదు’ అంటూ ఆది శంకరాచార్యుల చెప్పిన మాటలను తన పోస్టులో పొందుపరిచింది రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రేణు దేశాయ్ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ తల్లికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు.

పవన్ కల్యాణ్ తో విడాకుల తర్వాత రేణూ దేశాయ్ ఒంటరిగా ఉంటూ తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాగోగులతో జీవితం గడుపుతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తునే అనాథ పిల్లలు, మూగ జీవాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది. కొన్ని రోజుల క్రితమే తన కూతురు ఆద్య పేరు మీదుగా శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌’ అనే ఎన్జీవోను ప్రారంభించింది.

Advertisement

Next Story