- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్లేయరే ఆస్ట్రేలియా టార్గెట్.. : రవిశాస్త్రి ‘కీ’ కామెంట్స్
X
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగే తొలిటెస్టులో ఆస్ట్రేలియా మెయిన్ టార్గెట్ బుమ్రానే అని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. కెప్టెన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా టీంపై ప్రభావం చూపాలని ఆసీస్ భావిస్తుందన్నాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌పై ఒత్తిడి పెంచడం ఆస్ట్రేలియాకు అలవాటు అన్నాడు. బుమ్రాపై సైతం ఇదే ఫార్ములాను ఆసీస్ ఉపయోగిస్తుందని తెలిపాడు. బుమ్రా పరిణతి చెందిన ఆటగాడని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా జట్టుపై అదే స్థాయిలో బుమ్రా బౌలింగ్‌తో దాడి చేస్తాడని చెప్పుకొచ్చాడు. పేసర్ల నుంచి మద్దతు లభిస్తే బుమ్రా మరింత అద్భుతంగా ప్రదర్శన ఇస్తాడన్నాడు. బుమ్రాపై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అనేది కూడా మర్చిపోవద్దన్నాడు.
Advertisement
Next Story