- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సంత మూలపడింది
దిశ, మోత్కూరు: మున్సిపల్ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజల సౌలభ్యం కోసమే సొంత అంగడిని పునః ప్రారంభించడం జరిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలో పశువుల సంత తై బజార్ అంగడిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత పాలకుల నిర్లక్ష్యంతో అర శతాబ్దం పైగా నడిచిన సంతను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంత మూసివేసిన కారణంగా అటు ఉత్పత్తిదారులు వినియోగదారులు ఎన్నో ఇబ్బందులకు గురైన విషయం గుర్తించి పరిసర మండలాల గ్రామాల ప్రజలకు తిరిగి సేవలందించాలనే లక్ష్యంతోనే తిరిగి ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
సంత ప్రారంభమైన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పడానికి అయ్యే ఖర్చులో లక్ష రూపాయలను తాను భరించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం స్టేజి నుంచి జానకిపురం అలాగే శాలిగౌరారం మండల కేంద్రం నుంచి అమలు వరకు రెండు లైన్ల రహదారిని మంజూరు చేయించినట్లు తెలిపారు. అలాగే పాత తాలూకా అయిన మోత్కూరులో డిగ్రీ కళాశాల తిరుమలగిరిలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారని త్వరలోనే కార్యాచరణ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం కవిత లక్ష్మి నరసింహ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, కారపోతుల శిరీష, దెబ్బేటి విజయ, మలిపెద్ది రజిత, కో ఆప్షన్ మెంబర్‌లు పోలినేని ఆనందమ్మ, గనగాని నరసింహ, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మలిపెద్ది మల్లారెడ్డి నాయకులు, పైల సోమిరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండుగోని రామచంద్ర, గౌడ్ కొప్పుల కరుణాకర్ రెడ్డి, ఉయ్యాల అంజయ్య చేత రాశి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.