- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బలహీన వర్గాలను వేధించడమే సంకినేని పని : జానయ్య యాదవ్..
దిశ, సూర్యా పేట ; ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరేనని, బలహీన వర్గాలను వేదించడమే మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు పని అని డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు. బుధవారం వజ్ర రైస్ మిల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంకినేని వెంకటేశ్వారావు పై ధ్వజమెత్తారు. సూర్యపేట పట్టణంలోని జనగామ రోడ్డులో గల వజ్రటౌన్ షిప్ పక్కన మూసీ కాల్వను అక్రమించారని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే అన్నారు. ఆరోపణలు చేయడం, తోక ముడవడం సంకినేనికి అలవాటు అని ఎద్దేవా చేశారు. నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం సంకినేనికి అలవాటు అయ్యిందన్నారు. బలహీన వర్గాలకు చెందిన నాపై, బలమేన వర్గాల నాయకులను పంపి సంకినేని రాక్షస ఆనందం పంపుతున్నాడని, సంకినేనికి దమ్ముంటే స్వయంగా ఆయనే చర్చకు రావాలన్నారు. అంతే కాని బలహీన వర్గాల నాయకులని పంపి రాజకీయ వికృత క్రీడకు పాల్పడుతున్నాడన్నారు.
సర్వేనెంబర్ 480లో మూసీ కాల్వ ఆక్రమణ జరిగిందని చేస్తున్న ఆరోపణ నిరాధారమని కొట్టిపారేశారు. మూసీ కాల్వను అక్రమించలేదు అని కలెక్టర్ ఏర్పాటు చేసిన 4గురు సభ్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. వజ్ర రైస్ మిల్ ఏర్పాటు చేసిన దగ్గర నుండి చాలా నిజాయితీగా రైతులకు సేవ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వడంలో వజ్ర రైస్ మిల్ అగ్రస్థానంలో ఉందన్నారు. నన్ను అడ్డం పెట్టుకొని మంత్రి జగదీష్ రెడ్డి మీద ఆరోపణలు చెయ్యాలి అనుకుంటే సూర్యుడు మీద ఉమ్మివేసినట్టేనాని పేర్కొన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి మహనాయకునిగా సంకినేని ఫీల్ అవుతున్నాడని, 20సంవత్సరాలుగా వార్డు మెంబర్ స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి నిత్యం ప్రజల్లో ఉంటున్నానన్నారు. బలహీన వర్గాలకు చెందిన నా ఎదుగుదలను చూసి సంకినేని ఓర్వలేక పోతున్నాడని సంకినేని సొంత ఊరికి తరిమే అంత వరకు తన పోరాటం ఆగదు అని సంకినేని వెంకటేశ్వర రావు పై ఆగ్రహం వ్యక్తంచేశారు.