రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది:మాజీ మంత్రి

by Naveena |
రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది:మాజీ మంత్రి
X

దిశ , సూర్యాపేట : మహిళలకు పవిత్రమైన బతుకమ్మ పండుగ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ది అట్లతద్దె.. అందుకే బతుకమ్మ పాట వింటే సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.వరదలు వచ్చిన వ్యాఖ్యలు చేశారు. నప్పుడు బీఆర్ఎస్ బాధితులకు బాసటగా నిలిచిందని తెలిపారు. సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ను.. ఆపగలరేమో గాని ఉద్యమాలని ఆపలేరన్నారు. దాడులు, కేసులు, నిషేదాలతో బతుకమ్మ పాటను ఆపలేరని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఎప్పుడు ప్రజల్లోకి రావాలో తెలుసని అన్నారు. కేసీఆర్ బతుకమ్మ పండుగకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని,అందుకు రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారని చెప్పారు. కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునోళ్లం మన సంప్రదాయాలను కాపాడుకోలేమా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,ఉప్పల ఆనంద్,నెమ్మాది భిక్షం,తాహెర్ పాషా,రేణుబాబు,అనిల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed