గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

by Naresh |
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
X

దిశ,చౌటుప్పల్/సంస్థాన్ నారాయణపురం: గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించి నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లక్కారం, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని మేళ్లచెరువులను లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో పాటు మరికొంతమంది ఇంజనీర్లతో కలిసి ఆయన పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంజనీర్లతో కలిసి చెరువుల నింపేందుకు అనువైన మార్గాలను శోధించారు. అంతేకాకుండా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని మేళ చెరువును నీటితో నింపి సుందరీకరణ చేసి టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తామని తెలిపారు. గొలుసు కట్టు చెరువులో నీటిని నింపడంతో స్థానికంగా ఉండే రైతుల బోర్లలో పుష్కలంగా నీరు సమకూర్తుందని ఇంజనీర్ల బృందం అభిప్రాయపడింది.

అంతేకాకుండా ఒక్కో చెరువును నింపడంతో సుమారు 50 వేల నుంచి లక్ష బోర్లలో నిరంతరం నీరూ సరఫరా జరుగుతుందని దాంతో రైతులు ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. అంతేకాకుండా మేళ్లచెరువులో నీటిని నింపడంతో చుట్టూ కొండలు ఉండడంతో టూరిజం స్పాట్‌గా కూడా అభివృద్ధి చేయవచ్చని ఇంజనీర్ల బృందం అభిప్రాయపడింది. ఆయన వెంట చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, ఏపూరి సతీష్, సుర్వి నరసింహ, ఉప్పల లింగస్వామి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed