Yarravaram Society : అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపం అనే వార్తకు స్పందన..

by Sumithra |
Yarravaram Society : అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపం అనే వార్తకు స్పందన..
X

దిశ, కోదాడ : ఈ నెల 4వ తేదీన అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపం అనే వార్త దిశ దినపత్రికలో ప్రచురితమైనది వార్తకు స్పందించిన అధికారులు కోదాడ మండల పరిధిలోని యర్రవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సహకార సంఘ పరిధిలో సుమారు 66 మంది రైతులకు రుణాలు మాఫీ కాకపోవడంతో ఈనెల 7వ తేదీన డీసీఓ పద్మ సహకార సంఘానికి 66 మంది పేర్లు సాఫ్ట్వేర్ నందు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన కంప్యూటర్ ఆపరేటర్, సంఘ కార్యదర్శి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణకు, చైర్మన్ కు ఆదేశాలు జారీ చేశారు. డీసీఓ పద్మ ఆదేశాను సారం యర్రవరం గ్రామసహకార సంఘంలో చైర్మన్ నలజాలా శ్రీనివాసరావు సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణ పాల్గొన్నారు. సంఘసభ్యుల పై కార్యదర్శి పరుష పదజాలంతో దూషించాడని, ఈ నెల 30వ తేదీ వరకు 66 మంది రైతులందరికి రుణమాఫీ జరిగే విధంగా చేస్తానని తీర్మానంకు అడ్డుపడ్డాడని, అయినా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ నెల 30వ తేదీ వరకు 66 మంది రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూడాలి అని లేనిచో ఇద్దరిని విధులనుంచి తొలగిస్తామని కమిటీ సభ్యులు అందరూ కలిసి తీర్మానం చేశారు. అనంతరం జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణ మాట్లాడుతూ సహకార సంఘ సభ్యులు ఏ విధంగా అయితే తీర్మానం చేస్తారో దానిని పై అధికారుల దృష్టికి తీసుకుని వెళతానని తెలిపారు. వారి వెంట డైరెక్టర్లు, సహకార సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed