- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
SFI : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి..
దిశ, నేరేడుచర్ల : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి భాను వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య అందించడం కష్టంగా మారిందన్నారు. నేరేడుచర్ల జూనియర్ కళాశాలలో 200 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కూడా విద్యార్థులు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక నైట్ లేక విద్యార్థులు ఇబ్బంది పడతున్నారని, కనీస తాగునీరు కూడ లేని పరిస్థితి ఉందన్నారు. అలాగే మరుగుదొడ్లు, టాయిలెట్ రూమ్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తామని చెప్పి ఈరోజు విద్య పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు అభి, నేరేడుచర్ల టౌన్ కమిటీ సభ్యుడు సాయి వరుణ్ వినయ్ గోపి స్వాతి తదితరులు పాల్గొన్నారు.