- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి !
దిశ, దేవరకొండ : తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని దేవరకొండ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ వస్కుల కృష్ణయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించాలని ఆయా మండలాల అధ్యక్షులకు సూచించారు. అలాగే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో నియోజకవర్గంలోని ఉన్న అన్ని మండలాల్లో గ్రామాల్లో పర్యటిస్తా అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎన్ ప్రసాద్, రేటినేని వెంకటేశ్వర్ రావు, పట్టణ అధ్యక్షులు నీలసుమన్, మండల అధ్యక్షులు గార్లపాటి శ్రీను, నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు కోతి అమరేందర్ రెడ్డి, మల్లేపల్లి మండల అధ్యక్షుడు కోట్ల జగదీష్, చందంపేట మండల అధ్యక్షుడు బ్రహ్మచారి, చింతపల్లి మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్, టీఎన్ఎస్ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులువస్కుల రాజేష్, లచ్చిరాం నాయక్, కడారి శ్రీను, జంగయ్య, దొడ్డి శ్రీను, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు జర్పుల జగన్, తదితరులు పాల్గొన్నారు.