వైద్యుల నిర్లక్ష్యం.. కుర్చీలోనే మహిళ డెలివరీ

by Nagam Mallesh |
వైద్యుల నిర్లక్ష్యం.. కుర్చీలోనే మహిళ డెలివరీ
X

దిశ, చింతపల్లిః వైద్యుల నిర్లక్ష్యానికి అక్కడక్కడా జరుగుతున్న ఘటనలు అద్దం పడుతూనే ఉన్నాయి. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే గవర్నమెంట్ ఆస్పత్రుల డాక్టర్ల తీరు మాత్రం మారట్లేదు. తాజాగా వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిల కుర్చీలోనే డెలివరీ అయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. నల్గొండ జిల్లా నెరెడుగొమ్ము గ్రామానికి చెందిన నల్లవెల్లి అశ్విని ఆంజనేయులు దంపతులు. అయితే అశ్వినికి నెలలు నిండటంతో వారు గురువారం రాత్రి నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ డాక్టర్లు లేరని.. నల్గొండకి తీసుకెళ్ళాలి అని భయబ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పంపించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో నల్గొండ జిల్లా ఆసుపత్రికి వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మూడో కాన్పుకి దేవరకొండలో చేయించక అని తిట్టారు. ఈ క్రమంలో అశ్వినిని బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు నర్సులు. నొప్పులు వస్తున్నాయి అని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. తీవ్ర నొప్పులతో బాధ పడుతూ కుర్చీలోనే డెలివరి అయింది. కుర్చీ కింద తీవ్ర రక్త స్రావం జరిగింది. అప్పుడు అందరూ వచ్చి హడావిడి చేయడమే కాకుండా.. తిరిగి పేషెంట్ పేరెంట్స్ నే తిట్టడం గమనార్హం. ఆ తరువాత లోపలికి తీసుకెళ్ళారు. అక్కడ చూసిన వారందరూ డాక్టర్, నర్సులను తిట్టారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని బాధితురాలు భర్త ఆంజనేయులు డిమాండ్ చేశారు. డ్యూటీ లో ఉన్న డాక్టర్, నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed