- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే కసిరెడ్డి
దిశ, కడ్తాల్: ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యా రంగానికి పెద్దపీట వేస్తుందని, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గానికి విద్యారంగ అభివృద్ధి కోసం 20 కోట్లకు పైగా నిధులు పాఠశాలల మౌలిక సదుపాయాల వంట రూములు, తాగునీరు, మూతశాలలు మరుగుదొడ్లు, తరగతి గదులు మరమతుల, సదుపాయాల కల్పించేందుకు నిధులు కేటాయించిన ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో ఒక్క డీఎస్సీ మాత్రమే వేసిన ఘనత గత ప్రభుత్వానిదని , రేవంత్ రెడ్డి సారథ్యంలో పది నెలల్లోనే కొత్త ఉపాధ్యాయులను నియమించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పెండింగ్ లో ఉన్న ఎంఈఓ పోస్టులను హెచ్ఎంలను నియమించిందని తెలిపారు. ఇందువల్ల పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యా బోధన మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, అమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ శర్మ, డిసిసి ప్రధాన కార్యదర్శి బీఖ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు బీఛ్యా నాయక్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మ నాయక్, మాజీ ఎంపిపి కమ్లి మోత్య నాయక్, నాయకులు జంగీర్ అలి, యాదగిరి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభు, హీరసింగ్, తులసిరం, జాహవార్లల్, యాదగిరిరెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.