విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. కాలిపోతున్న గృహపకరణాలు

by Vinod kumar |
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. కాలిపోతున్న గృహపకరణాలు
X

దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువు మండలం కేంద్రంలో కరెంటు కష్టాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నెలవారీ బిల్లులు వసూలు చేస్తున్నప్పటికీ నాణ్యమైన కరెంటు ఇవ్వడంలో అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మండల కేంద్రంలో సుమారు 30 ట్రాన్స్ఫార్మర్స్ పనిచేస్తుండగా వాటిలో చాలా వాటికి ఏబీ స్విచ్స్ లేకపోవడం ఉన్న అవి సరిగ్గా పని చేయకపోవడం, ఏ చిన్న కరెంట్ రిపేర్ వచ్చిన సబ్ స్టేషన్ నిలుపుదల చేస్తున్నారని దీనివల్ల రోజులో ఎన్నోసార్లు కరెంటు వచ్చి పోవటం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. డిపార్ట్‌మెంట్‌కి మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంతో ఇట్టి విషయం గ్రామ సభ ద్వారా అధికారులకు చెప్పుకున్న పరిష్కారం లభించలేదని గ్రామస్తులు వాపోయారు.

తాజాగా రెండు రోజుల క్రితం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ బజార్లో కరెంటు ఎక్కువగా వస్తున్నదన.. దాదాపు 20 ఇళ్లలలో టీవీలు, ఫ్రిజ్లు ఫ్యాన్లు, ఏసీ వంటి గృహప్రకాణాలు చెడిపోయాయని. సోమవారం ఉదయం ఒక గంటలోనే 6,7 సార్లు కరెంటు వచ్చి పోవడంతో చాలా గృహపకరణాలు చెడిపోయినట్లుగా ప్రజలు ఆరోపిస్తున్నారు.

కరెంటు ఏఈ వివరణ ..

గత కొన్ని రోజులుగా కరెంటు అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని ట్రాన్స్ ఫార్మర్స్ ఆన్ ఆఫ్ స్విట్చె బడ్జెట్ లేకపోవటంతో కొత్తవి ఏర్పాటు చేయలేకపోతున్నామని. నిరంతరం కరెంట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story