నల్గొండ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా : మంత్రి కోమటిరెడ్డి

by Kalyani |
నల్గొండ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా : మంత్రి కోమటిరెడ్డి
X

దిశ,నల్గొండ : నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ కాలనీలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ సబ్ స్టేషన్ వల్ల 15,000 కుటుంబాలు లో వోల్టేజి సమస్యను అధిగమిస్తాయని,రెండు నెలల్లో సబ్స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఇంజనీర్లను ఆదేశించారు. నాణ్యమైన కేబుల్ తో పాటు, ఫెన్సింగ్ వేయాలని ,24 గంటలు సెక్యూరిటీ గార్డ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తామని, 2004లోనే నల్గొండలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,సిసి రోడ్లు వేసామని, నల్గొండ మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన గ్రామాలకు తాగునీటి కోసం 200 కోట్ల కేటాయించామని , పట్టణంలో 90 కోట్ల రూపాయలతో నీలగిరి సాంస్కృతిక నిలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. భూమి ఇస్తే పట్టణంలో మరో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపడతామని,టి హబ్ తో పాటు ,కలెక్టరేట్ వద్ద మరో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కడుతున్నామని అన్నారు. పట్టణంలో రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా మరో మూడు సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

అలాగే పట్టణానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను ఇస్తామని, నల్గొండ పట్టణంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు 10 ఎం ఎల్ డి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 30 కోట్ల మంజూరు చేశామని తెలిపారు. 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, ఎవరికీ నష్టం చేయమని, మార్కెట్ ధర కన్నా ఎక్కువ నష్టపరిహారం ఇస్తామని, ఎస్ ఎల్ బి సి కాలనీ వద్ద అన్ని వసతులతో మల్టీపర్పస్ హాస్టల్ ను కట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాధికారులను ఆదేశించారు.ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన తీసివేయాలని ఆదేశించారు.నల్గొండ టౌన్ ను మోడల్ గా తీర్చిదిద్దుతామని, సబ్స్టేషన్లన్నీ ఆరు నెలల్లో పూర్తి చేసి లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ సి .నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ ఈ చంద్రమోహన్, ఆర్డిఓ రవి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed