సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. జులై నెలలో ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే!

by Jakkula Samataha |
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. జులై నెలలో ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే!
X

దిశ, సినిమా : సినిమా ప్రియులకు అదిరిపోయే న్యూస్. ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సీరిస్ ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, జులై నెలలలో కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను అలరించబోతున్నాయి. కరోనా తర్వాత నుంచి చాలా మంది ఓటీటీవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రోజుల్లో సినిమా థియేటర్స్ కు వెళ్లి మూవీ చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.ఎందుకంటే మూవీ రిలీజైన 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో వారు ఓటీటీలో సినిమాలు చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, జులై నెలలో ఏ సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయో ఇప్పుడు చూద్దాం.

1. మనమే : శర్వానం, కృతి శెట్టి జంటగా నటించిన మనమే మూవీ జులై రెండో వారంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

2. హరోం హర : దర్శకుడు జ్ఞాన సాగర్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా హరోం హర. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

3. రక్షణ : పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన రక్షణ సినిమా జులై 21 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.

4. శశి మదన : సోనియా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ జులై 4 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

5. మార్కెట్ మహాలక్ష్మీ : పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన మార్కెట్ మహాలక్ష్మి చిత్రం జులై 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed