- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంత, నాగచైతన్య విడాకులకు కారణం చిరంజీవి నేనా? ఇన్ని రోజులకు బయటపడ్డ షాకింగ్ నిజం!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. అయితే ఈ బ్యూటీ ఏమాయ చేశావే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తర్వాత మొదటి సినిమాతోనే నాగచైతన్యతో ప్రేమలో పడి, పెద్దల నొప్పించి పెళ్లి చేసుకుంది. ఇక క్యూట్ కపుల్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట, విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. వీరి విడాకులకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో రూమర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా?
సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఒక రకంగా చిరంజీవి కూడా కారణం అంటున్నారు కొందరు. ఎందుకంటే? పెళ్లైన తర్వాత సమంతకు రామ్‌చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడంతో , ఇందులో సమంతను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కానీ ఆమెను తీసుకోవడానికి ముందుగా మూవీ టీం చాలా ఆలోచించిందంట. సెలబ్రెటీ ఇంటికి కోడలిగా వెళ్లిందిగా, ఇప్పుడు సినిమాలు చేస్తుందో లేదో అని చిరుతో మాట్లాడగా, ఆయన పెళ్లి అయిపోతేనే, ఆమె ఒక హీరోయిన్ కదా.. క్యారెక్టర్ నచ్చితే చేయమని చెప్పండి, అని చెప్పారంట. దీంతో ఆ పాత్ర కూడా సమంతకు నచ్చడంతో ఒకే చేసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పెళ్లి తర్వాత సమంత మళ్లీ తన నటనతో మంచి ఫేమ్ సంపాదించాలని, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు సైన్ చేసింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు లైఫ్ అనుకోని విధంగా మలుపు తిరిగింది. దీంతో సమంత నాగచైతన్యల విడాకులకు పరోక్షంగా చిరు కూడా కారణం అయ్యాడు అంటున్నారు కొందరు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది