MLA Rajagopal Reddy: గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధికి నిధులు: మునుగోడు ఎమ్మెల్యే

by Mahesh |
MLA Rajagopal Reddy: గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధికి నిధులు: మునుగోడు ఎమ్మెల్యే
X

దిశ, మర్రిగూడ: గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నాంపల్లి మండల కేంద్రం లోని ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ధనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చిట్టంపాడు నుండి తిరుమలగిరి రోడ్డు నిర్మాణానికి శివన్న గూడెం నుంచి నామపురం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముష్టిపల్లి, తిరుగండ్లపల్లి గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. శివన్నగూడ నుండి అంతంపేట రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శివన్నగూడలో అంగన్వాడి భవనాన్ని నూతన రేషన్ షాపును ప్రారంభించారు . రేఖ్య తండాలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ఉద్ఘాటించారు.

బెల్టు షాపులు మూసి వేయకుండా ఏ ఒక్క నాయకుడు నా దగ్గరికి రావద్దని సూచించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉదయం నుంచి ఎక్కడబడితే అక్కడ తాగుతున్నారని ముష్టిపల్లి గ్రామంలో మహిళలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలీసులపై ఫైర్ అయ్యారు. బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో మహిళలు బెల్ట్ షాపులు నిర్మూలన కమిటీలు వేసి అధికారులకు సహకరించాలని సూచించారు. మహిళల చేత ముష్టి‌పెళ్లిలో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈలు రాజేష్, సాగర్ రెడ్డి, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు, నాంపల్లి, మర్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, రాందాస్ శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి ఏవీ రెడ్డి, పాశం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటంపేట్ బాలయ్య, మాస శేఖర్, రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed