కేసీఆర్‌ను కలుస్తా.. కొట్లాటొద్దని చెప్తా: కోమటిరెడ్డి

by S Gopi |   ( Updated:2022-09-02 09:17:58.0  )
కేసీఆర్‌ను కలుస్తా.. కొట్లాటొద్దని చెప్తా: కోమటిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మధ్య కొట్లాట పెట్టొద్దంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ ఎనిమిదేండ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈ నెల 18న జారీ చేసిన జీఓ నెంబర్ 246 నల్లగొండ రైతులకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి విడుదల చేసిన ఆ జీవోతో నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నీటి కేటాయింపు విషయంలో సీఎం కేసీఆర్ ను కలుస్తానని, నల్లగొండ-పాలమూరు మధ్య కొట్లాట పెట్టొద్దని.. వెంటనే ఆ జీవోను రద్దును చేయాలని కోరుతానని... అప్పటికీ వినకపోతే దీక్ష చేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Also Read : అమిత్ షా మీటింగ్‌కూ కేసీఆర్ దూరం.. అదే రోజున రాష్ట్రంలో కీలక సమావేశం?

Advertisement

Next Story

Most Viewed