MLA Nenawat Balu Naik :మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే

by Naveena |
MLA Nenawat Balu Naik :మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ,చింతపల్లి : చింతపల్లి మండల కేంద్రంలోని వనస్థలిపురం ప్రసిద్ధ హాస్పిటల్ సారథ్యంలో.. మెగా హెల్త్ క్యాంపును ఆదివారం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్( MLA Nenawat Balu Naik ) ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ను మెగా క్యాంప్ చైర్మన్లు చైతన్య రాజు ప్రదీప్ లు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వృద్ధులు, వికలాంగులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ మెగా క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రసిద్ధి హాస్పిటల్ చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్, మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి, హాస్పటల్ చైర్మన్ లు చైతన్య రాజు, ప్రదీప్ మాజి జెడ్పిటిసి హరి నాయక్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటయ్య,గిరి, ప్రశాంత్ చాట్ల కిషన్, క్యాంప్ బృందం,యువజన విభాగ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story