సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

by Naveena |
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు
X

దిశ, మునుగోడు; సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తి తెచ్చిన రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ కోతలు విదిస్తే సహించేదిలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీసీఐ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మునుగోడు మండలంలోని కొంపెల్లి గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన అకస్మిక తనిఖీ చేశారు. సీసీఐ అధికారులు, మిల్లర్ యాజమానులు ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సీసీఐ నిర్వాహకులు, మిల్లర్ యాజయానుల పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. తేమ శాతం పేరుతో క్వింటాలు పత్తి కోతలు విదించడం సరికాదన్నారు. కొనుగోలు కేంద్రాలకు పత్తి తెచ్చిన రైతులను రోజుల తరబడి ఆపకుండా వెంటనే దిగుమతి చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో ట్రాక్టర్లు వచ్చిన వెంటనే తేమ శాతాన్ని చెక్ చేయాలన్నారు. ఆయన వెంట ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పిటిసి నారబోయిన స్వరూపరాణి రవిముదిరాజ్, చిలుకూరి ప్రభాకర్, కాంగ్రేస్ మండల పార్టి అధ్యక్షులు బీమనపల్లి సైదులు, మాజీ వైస్ ఎంపీపీ అనంత వీణస్వామి గౌడ్, నాయకులు వెదిరే విజేందర్ రెడ్డి, పాల్వాయి జితేందర్, మేకల ప్రమోద్ రెడ్డి, దోటి నారాయణ, ఎండి అన్వర్, జాల వెంకన్న, వట్టికోటి శేఖర్, తాటికొండ సైదులు, మేకల మల్లయ్య, పోలగోని ప్రకాశ్, జాజుల సత్యనారాయణ, నాగరాజు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Next Story