వలిగొండ మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరుస్తా.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి..

by Sumithra |
వలిగొండ మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరుస్తా.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి..
X

దిశ, వలిగొండ : వలిగొండ మండలాన్ని అన్ని అంగుళాలతో ప్రతి గ్రామంలో అన్నిమౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పరుస్తానని భువనగిరి స్థానిక సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దాసిరెడ్డి గూడెంలో ఎస్సీ కమిటీ హాల్ శంకుస్థాపన. గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నాతాళ్ల గూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో 40 లక్షలతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ పాఠశాల ప్రహరీగోడ నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడుతూ మండలంలోని ప్రతిగ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రజల అవసరాన్ని తీరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్, జడ్పీటీసీ వాకిటి పద్మ, వైస్ ఎంపీపీ బాసరాజు ఉమా, సర్పంచులు కొమురెల్లి సరిత, ఉల్లిపే మల్లేశం, ఎంపీటీసీలు నోముల మల్లేష్ యాదవ్, మోటే నరసింహ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజా వర్ధన్ రెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి, వార్డు మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story