- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానంగా నెల్లికల్ లిఫ్టును తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే నోముల భగత్
దిశ, తిరుమలగిరి (సాగర్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానంగా నెల్లికల్ లిఫ్ట్ ను తీర్చిదిద్దుతామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే నెల్లికల్ లిఫ్ట్ పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికలు లిఫ్ట్ గత పాలకులు మొదటగా 5000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించే విధంగా రూపొందించారని తెలిపారు. నెల్లికల్ లిఫ్టును రీడిజన్ చేసి 25వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన తెలిపారు. గత పాలకులు గిరిజనులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారే తప్ప గిరిజన సమస్యను తీర్చలేదని అన్నారు. అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి చేయలేని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంలో నెరవేరుస్తున్నామని తెలిపారు.
గిరిజనుల చిరకాల స్వప్నం నెల్లికలు లిఫ్ట్ వచ్చే సంవత్సరం మే నెల వరకు పూర్తి చేసి గిరిజనులకు సాగునీరు అందిస్తామని అన్నారు. గతంలో పనులు ప్రారంభించిన ప్రాజెక్టులోని నీరు చేరడంతో పనులు చేయడానికి వీలు కాలేదని.. ప్రస్తుతం ఇప్పుడు రింగ్ బండ వేయించి పనులు ప్రారంభించామని తెలిపారు. నెల్లికలు లిఫ్ట్ మోటర్ పనులు, పైపులైన్లు యుద్ధ ప్రాతిపదికన రెండు ఒకేసారి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, ఎంపీటీసీ సుజాత పాండు నాయక్, సర్పంచ్ లు దేవుడు, జగ్గీ, స్వామి నాయక్, మల్లిఖార్జున్, భాను రాథోడ్, గుండాల రవి, మేకపోతుల కార్తీక్, మార్కెట్ డైరెక్టర్ హరికృష్ణ, పెద్దిరాజు, షేక్ బషీర్, రమేష్ నాయక్, కాళేశ్వర్ రావు, బుర్రి బాలనర్సింహా, బుర్రి శ్రీను, వాట్టాలా కృష్ణా, సక్క నాయక్, పెద్ద వెంకట్ రెడ్డి, శ్రీను, గోపి, రమేష్, మేరావత్ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.