- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు
దిశ, హుజూర్ నగర్ : గత నాలుగు రోజుల క్రితం నుండి మిషన్ భగీరథ పైప్ లైన్ నుండి ఇంటర్నల్ పైపు లైన్ ద్వారా ట్యాంకుకు వెళ్లే పైప్ లైన్ పగిలి ఆ నీరంతా రోడ్డుపై ప్రవహించడం తోపాటు అక్కడ అంతా గుంతల మయంగా మారింది. విషయం అధికారులకు చెప్పినా వారు స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై పైప్ లైన్ పగిలిపోయింది. దాంతో అక్కడ నీరంతా బయటకు వెళ్లి రోడ్డుపై ప్రవహిస్తుంది.
అలాగే ఇది గరిడేపల్లి నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాలు రద్దీగా తిరుగుతుంటాయి. ఈ వాహన రద్దీ వల్ల ఆ ప్రాంతమంతా గుంతలమయంగా మారుతుంది. ఈ విషయాన్ని స్థానికులు కొందరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం దోమల వల్ల విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని, ఈ నీటితో దోమల వ్యాప్తి పెరిగి విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనివల్ల గ్రామంలో తాగునీటి సమస్య కూడా ఏర్పడుతుందన్నారు. దీనిపై తక్షణమే స్పందించి ఆ నీటిని నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.
- Tags
- Bhagiratha Water