- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Uttam Kumar Reddy : రాష్ట్రం లో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
దిశ,సూర్యాపేట టౌన్; ప్రజలకు సేవ చేయటంలో పోలీస్ శాఖ ముందంజలో ఉంటుందని మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy )అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి, పోలీస్ హౌజింగ్ ఐజీ సత్యనారాయణ ,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. తదుపరి మంత్రి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. 70 లక్షల రూపాయలు పోలీస్ హౌజింగ్ శాఖ నుంచి 20 లక్షల రూపాయలు పంచాయతీ రాజ్ శాఖ నుంచి నిధులు సమాకుర్చడం జరిగిందని,ఈ రోజు నా చేతులు మీదుగా కార్యాలయం ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రెండ్లి పోలీస్ అమలు చేయాలని సూచించారు.పోలీస్ శాఖ క్రమశిక్షణ కలిగిన శాఖ అని వృత్తి నిర్వహణలో ఎంతోమందికి సేవలు చేయడంలో పోలీస్ వారు ముందుంటున్నారని కొనియాడారు. సమాజంలో శాంతిభద్రతల రక్షణలో పోలీసు సిబ్బంది పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు శ్రమిస్తున్నారని,రాష్ట్ర పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
దేశంలోనే తెలంగాణ పోలీసు ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడంలో నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి తో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ పోలీస్ స్టేషన్లు అనంతగిరి, చింతలపాలెం,పాలకీడు,మద్దిరాల,నాగారం పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని ఆన్నారు. రాష్ట్రంలో పోలీస్ భవనాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు హాజింగ్ సొసైటి కృషి చేస్తుoదని తెలిపారు. పోలీస్ హౌసింగ్ సొసైటీ ఉత్తమంగా పనిచేయడానికి ఆర్థిక సదుపాయాలు కల్పించడానికి నిధులు ఇప్పిస్తామని తెలిపారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి నూతన కార్యాలయం నందు డిఎస్పి రవి ని చైర్ పై కూర్చోబెట్టి పుష్పగుచ్చం ఇచ్చి మంత్రి,అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రం లో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు...
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిశ్చయంగా ఉందని,రికార్డు స్థాయిలో ఈసారి ధాన్యం దిగుబడి అయిoదని,రైతుల నుండి ప్రతి గింజ సేకరిస్తామన్నారు. దీని కోసం20,000 కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్ని కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని 500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2.20 కోట్ల లబ్ధిదారులకి ఉచిత బియ్యం ఇవ్వడానికి బియ్యం నాణ్యత పెంచామని అందరికీ సంక్రాంతి తర్వాత సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని,దీనికోసం సన్నబియాన్ని సేకరిస్తున్నామని సన్నబియ్యం సేద్యం చేసేలా రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలలో ధాన్యం సేకరణకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేశామని, ఈ స్థాయిలో ధాన్యం సేకరణ ఎప్పుడు జరగలేదని మిల్లర్లకు కూడా ఇబ్బంది లేకుండా ధరలు పెంచుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కలెక్టర్లకు పంపి దాని ప్రకారం కొనుగోలు చేయిస్తున్నామన్నారు. రైతులకు ప్రభుత్వం తరపున మాట ఇస్తున్నామని ప్రతి గింజ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, డీఎస్పీ లు రవి, శ్రీధర్ రెడ్డి,సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఛైర్మెన్ వేణారెడ్డి, సూర్యాపేట డివిజన్ సీఐ లు,ఏస్ ఐ లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.