- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
దిశ, భూదాన్ పోచంపల్లి: అసెంబ్లీ ఎన్నికల రోజులు దగ్గర పడుతున్న కొద్ది వివిధ పార్టీ కీలక నాయకులు కాంగ్రెస్‌లోకి వలసల పరంపర రోజురోజుకీ పెరిగిపోతూ ప్రత్యర్థులకు చెమటలు పెట్టిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కు గట్టి బలమున్న గ్రామాల్లో అగ్ర నాయకులే టార్గెట్‌గా ఓటు బ్యాంకును కొల్లగొట్టే విధంగా భారీ స్కెచ్ వేస్తూ ముఖ్య నాయకులను చేర్చుకొని అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ తీస్తోంది కాంగ్రెస్. తాజాగా మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ దొడ్డి అలివేల, దంతూరు గ్రామ 1, 2, 8వ వార్డ్ సభ్యులు లింగ స్వామి, పాండమ్మ, మన్నే సత్తిరెడ్డిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అలాగే మండలానికి చెందిన సీనియర్ ముఖ్య నాయకులు మాజీ ఎంపీపీలు కొమిరెల్లి నర్సింహా రెడ్డి, బడుగు దానయ్య దేశ్ ముఖీ, మాజీ సర్పంచ్ ముత్యాల బాల రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సిద్దగోని రంగయ్య గౌడ్, బీఆర్ఎస్‌ను వీడి కుంభం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంటింటి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రేవన పల్లి, శివారెడ్డి గూడెం, జలాల్పురం, దంతూరు గ్రామాలలోని అధికార పార్టీ పలు యువజన నాయకులు, యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేశం మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నర్సింహా రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి చైర్మన్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, మన్నే వెంకట్ రెడ్డి గోరుగంటి రవిందర్, ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ పల్లెల రమేష్ , బోదాసు ఈదయ్య, పల్లెర్ల పాండు, దోటి శివ గోరుగంటి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.