- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచ్‌గా గెలిపియ్యాలంటూ మేనిఫెస్టో విడుదల
దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్‌గా గెలిపియండి అంటూ గ్రామ యువ నాయకురాలు కొడారి లతా మల్లేష్ యాదవ్ మేనిఫెస్టో విడుదల చేశారు. మల్కాపురం గ్రామంలో పార్టీలకు అతీతంగా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపించి, గ్రామ సేవలో పాలు పంచుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా 14 అంశాలతో కూడిన మేనిఫెస్టో పోస్టర్‌ను విడుదల చేశారు. గ్రామపంచాయతీలో మంచినీటి ఫిల్టర్, కులాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు కోసం వైకుంఠ రథం, ఫ్రీజర్, వాటర్ ట్యాంకర్, ఇంటి పన్ను మాఫీ, చనిపోయిన కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం, ఆడపిల్ల జన్మిస్తే 5000 సహాయం ,ఆడపడుచు పెళ్లి కానుక, ఒంటరి మహిళలకు వృద్ధులకు నివాస వసతి గృహం, ఎస్సీ , బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం, నిరుద్యోగ ఆడపడుచులకు 30 కుట్టు మిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్, స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ ఆదోనికరణ పరికరాలు ,ముదిరాజ్ లకు చేపలు పెంచుకొనుటకు చెరువులపై పూర్తి అధికారం కోసం కృషి, గ్రామంలో గ్రామ దేవతల గుడి నిర్మాణం, అండర్ డ్రైనేజ్ ,సిసి రోడ్లు, బస్తీ దావఖాన, గ్రంథాలయం ఏర్పాటు చేసి యాదాద్రి జిల్లాలో మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.