బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌.. మూకుమ్మడిగా రాజీనామా

by Vinod kumar |
బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌.. మూకుమ్మడిగా రాజీనామా
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అందులో ఉమ్మడి నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ సతీమణి, 13 వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక యాదవ్ ఉండగా.. ఆమెతో పాటు మరో 100 మంది బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గాంధీ నగర్‌లోని వట్టే జానయ్య యాదవ్ నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట నియోజక వర్గానికి బహుజన కులాల పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ అందుకు జానయ్యపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

స్వల్ప కాలంలోనే నా భర్తపై డెబ్బైకి పైగా అక్రమ కేసులు మోపి పార్టీలో అణచివేత ధోరణికి గురి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ సమావేశాలకు సైతం మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే పార్టీలో ఇమడలేక ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు జానయ్య కుటుంబ సానుభూతి పరులు సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తల రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పార్టీలో గత తొమ్మిది సంవత్సరాలుగా జానయ్య సేవలందించారని, పార్టీ కార్యకర్తలు మాకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఆయనపై అణచివేత, నిర్బంధాలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. పనిచేసే వారికి ఎలాంటి పదవులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రస్తుతం నిర్ణయించు కోలేదని కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో ఏ పార్టీలో చేరే నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వారు..

మాజీ ఎంపీపీ భూక్యాకాంత, మాజీ ఎంపీటీసీ ముక్కాల పద్మ, ఎల్కారం మాజీ సర్పంచి మోదాల సైదమ్మ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట పట్టణ ఉఫాధ్యక్షులు మహ్మద్ చాంద్ పాషా, సూర్యాపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు కుంభం వెంకన్న యాదవ్, పెన్ పహాడ్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ వల్లాల సైదులు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు లింగాల సైదులు, దురాజ్ పల్లి పెద్దగట్టు మాజీ డైరెక్టర్ చింతకాయల జానయ్య, గాంధీనగర్ గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పలువురు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed