- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంప్యూటర్ విద్యకు గురువేదా ఫౌండేషన్ సహకారం అభినందనీయం
దిశ మోతె: గురువేదా ఫౌండేషన్ సహకారానికి కోదాడ శాసనసభ సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అభినందనలు తెలిపారు. గురువారం మండల పరిధిలోని సిరికొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పేద విద్యార్థులకు కంప్యూటర్ పై అవగాహన పెంచేందుకు గురువేదా ఫౌండేషన్ సహకారంతో పాఠశాలలో 10 కంప్యూటర్లను అందించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యకు ప్రభుత్వం అందిస్తున్న సహకారమే కాకుండా ఇలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం చాలా ఆనందమైన విషయమని, ప్రతి ఒక్కరు భవిష్యత్తు భావితరాలకు బాటగా నిలవాలన్నారు. ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో పోటీ పడేందుకు గురువేదా ఫౌండేషన్ తమ వంతు సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం చాలా ఆనందకరమని పద్మావతి గారు తెలియజేశారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
అనంతరం గ్రామంలో నూతనంగా పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వెనువెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. ఆడపడుచులకు అండగా ఉంటూ వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందిస్తూ మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురువేద ఫౌండేషన్ సీఈవో ధనుంజయ్, మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పందిల్లపల్లి పుల్లారావు, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంఈఓ గోపాలరావు, ఉపాధ్యాయులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.