- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జలదిగ్బంధంలో కోదాడ.. వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు
దిశ, కోదాడ : కోదాడ పట్టణంలో శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం ఆగకుండా భీభత్సంగా కురుస్తుండటంతో వాగులు పొంగి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ ఆజాద్ నగర్ ఎమ్మెస్ కళాశాల వెనుక వీధి సాయిబాబా థియేటర్ వెనుక వైపు నయా నగర్ లో మదర్ తెరిసా స్కూల్ వీధి ఖమ్మం రోడ్డు లో షిరిడి సాయి నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది జనం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది నడుము లోతు నీళ్లలో ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడిపారు.
వరదల్లో నీళ్ళ లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు మృతి... కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో నీరు ఉధృతంగా రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో నీటి ఉధృతిని గమనించకుండా కారును నడుపుకుంటూ వచ్చిన కోదాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన నారం రవి కుమార్ అనే వ్యక్తి కారుతో సహా వరదలు కొట్టుకొని మృతి చెందాడు. కాగా శ్రీమన్నారాయణ కాలనీ లో వాగులో వరద నీళ్లలో మరో వ్యక్తి ఎర్ర మాల వెంకటేశ్వర్లు కొట్టుకుని వచ్చి మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో బయట కట్టేసిన రెండు పాడి గేదెలు వరద నీళ్లలో చిక్కుకొని మృతి చెందాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన కారు ద్విచక్ర వాహనం నీళ్లలో కొట్టుకొని పోయాయి.
అనంతగిరి, ఖమ్మం వైపు రాకపోకలు బంద్...
కోదాడ పట్టణం నుండి అనంతగిరి వైపుకు నయనగర్ లో రోడ్డు పైకి ఎర్రగుంట చెరువు వాగు ఉధృతంగా వస్తుండడంతో కోదాడ అనంతగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం రోడ్డు లో తమరి దాటిన తర్వాత వరద నీరు రోడ్డు పైకి రావడంతో ఖమ్మం వైపు వెళ్లే వాహనాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
సిబ్బందిని అప్రమత్తం చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ...
వరద తాకిడి నుండి పట్టణ ప్రజలను కాపాడడానికి కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిలర్లు సిబ్బందిని అధికారులను అప్రమత్తం చేశారు వార్డు వార్డుకు జేసీబీలను పంపించి వరదనీటికి అడ్డం గా ఉన్న డివైడర్లను కట్టలను కల్వర్టులను తొలగించి వరద నీళ్లు చేరకుండా రాత్రంతా తీవ్రంగా కృషి చేశారు. 21 వ వార్డులో కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్ తమ వార్డుకు తీవ్ర ఉధృతి ఉండడంతో రాత్రంతా సిబ్బందితో వార్డులో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ తో కొట్టుకుపోయిన వాహనాలను కాలువ నుండి బయటకు తీయించారు.
అంధకారంలో కోదాడ...
వర్ష బీభత్సానికి కోదాడ లోని సబ్ స్టేషన్ నీటితో మునిగిపోయింది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నాలు అధికారులు చేసినప్పటికీ పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో వెనుకకు తగ్గారు దీంతో రాత్రంతా కోదాడ అందకారంలో మునిగింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీళ్ల కోసం జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
మున్సిపల్ కార్యాలయం లోకి వరద నీరు....
కోదాడ పట్టణ నడిబొడ్డున ఉన్న మున్సిపల్ కార్యాలయంలోకి వరద నీరు చేరింది పాత రికార్డుల గదిలో వరద నీరు చేయడంతో రికార్డులన్నీ నీళ్లలో మునిగిపోయాయి రహదారి కంటే ఆవరణ కంటే పాత భవనం కిందికి ఉండటం మూలంగా ఈ దుస్థితి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు ముఖ్యమైన రికార్డులకు ఎటువంటి నష్టం జరగలేదని పాత రికార్డుల కాగితాలు మాత్రమే తడిచిపోయాయని వారు వెల్లడించారు.
ముంపు ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్..
కోదాడలో వర్ష బీభత్సానికి గురైన వార్డులను జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఆదివారం ఉదయం పరిశీలించారు వరదను అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలను వరద బీభత్సానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు చేపట్టాల్సిన పునరావాస చర్యలపై కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణకు తాసిల్దార్ సూరయ్యకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రాణహాని జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ కమిషనర్ రమాదేవి బిజెపి నాయకులు హనుమంతరావు పలువురు వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ నియోజకవర్గంలో వర్ష బీభత్సం నుండి ప్రజలను కాపాడేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి లు చరవాణిలో జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డీవో మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు మున్సిపల్ పాలకవర్గం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలవాలని కోరారు
రాత్రంతా పహార కాసిన పోలీస్ యంత్రాంగం...
వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున నీరు వరదల ప్రవహిస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంత్రి ఉత్తమ ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పట్టణంలోని రంగా థియేటర్ వద్ద వరద బీభత్సంలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలను వర్షంలో తడుస్తూ రోడ్డు దాటించారు. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వరదలు కొట్టుకుపోతుండగా బయటికి తీసి కాపాడారు. పొంగుతున్న వాగుల వద్ద గస్తీ నిర్వహించి రోడ్డును దాటకుండా చర్యలు చేపట్టారు. వార్డులను కలియ తిరుగుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకానికి సహాయక చర్యలను అందించారు.
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు..
కోదాడలోని వర్షం కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయించారు. కోదాడ ఆర్డిఓ మున్సిపల్ కమిషనర్ కోదాడ పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు అందించారు. వరద నీటికి తో ఉండడానికి ఇబ్బందిగా ఉన్న కుటుంబాలను కోదాడ బాలుర ఉన్నత పాఠశాల లేదా సి సి రెడ్డి పాఠశాలలో పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
బాధితులను పరామర్శించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం...
వరద బీభత్సం పట్టణంలోని పలు వార్డుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ పరామర్శించారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు డిమాండ్ చేశారు. ఆయన వెంట కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ తదితరులు ఉన్నారు.