- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు జైలుకెళ్తారు : కోమటిరెడ్డి
దిశ,చౌటుప్పల్ : కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జైలుకెళ్లడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నారాయణపురం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పుట్టపాక సర్పంచ్ భాస్కర్ వారి అనుచరులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు మూకుమ్మడిగా ఓటేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఎదురుచూసిన ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరాశే కల్పించిందని ఆయన అన్నారు. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ లు చేసి పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించి బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు.
ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదని, కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కనీసం 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎంత పెద్ద మనుషులు ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ లో నుండి పార్టీలో కీలకంగా పనిచేశాడని అతనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి బాబా షరీఫ్, సుల్తాన్ రాజు, బత్తుల వరలక్ష్మి, కొరగోని లింగస్వామి, బండమీది మల్లేష్, బొడిగె వరలక్ష్మి, నాయకులు చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వీ నరసింహ తదితర కౌన్సిలర్లు ,నాయకులు సర్పంచులు, పాల్గొన్నారు.