- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చౌటుప్పల్‌లో కంఠమహేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు షురూ..
దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో శ్రీశ్రీశ్రీ సురమాంబ, కంఠమహేశ్వర స్వామి కళ్యాణ, బోనాల మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు చింతకింది అంజయ్య గౌడ్ లు తెలిపారు. బుధవారం దేవస్థానం ఆవరణలో ఉదయం మామిడి తోరణాలు, దేవతామూర్తుల అలంకరణ, గణపతి పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న, ఉదయం గం. 8 లకు గౌడ కులస్తుల ఇంట్లో నుండి జల బిందెలతో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం, గం.9:30 లకు హోమం, గం. 11 లకు పంచామృతాలతో స్వామివారికి జలాభిషేకం, వస్త్రాలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మధ్యాహ్నం గం.1.30 లకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. గం.2.30 లకు మోకు, ముస్తాదుల పూజా, సాయంత్రం గం. 5.30 లకు అష్టదిగ్బంధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
15న, ఉదయం 9.30 లకు రామాలయం దేవస్థానం నుండి ఉత్సవమూర్తుల విగ్రహాలను ఊరేగింపుగా తెచ్చుట కార్యక్రమం, గం. 10 గంటలకు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి ఎదుర్కోలు, గం.10:30 లకు శ్రీశ్రీశ్రీ సురమాంబ - కంఠమహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. 16న, ఉదయం గం. 10 లకు బోనాల ఊరేగింపు వంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమాలకు చౌటుప్పల్ పట్టణం లోని భక్తులు, గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.