'కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం'

by Sumithra |
కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం
X

దిశ, మూటకొండూరు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని వివిధ పార్టీల చెందిన 300 మంది కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అనంతుల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలో చేరిన వారికి బీర్ల ఐలయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్లంల సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed